టాప్ న్యూస్

కొండా తీరు మారలేదు?.. బర్తరఫ్ చేసినా సింపతీ రాలేదు?

ముఖ్యమంత్రికి ఎదురు తిరిగితే అంతే సంగతులు అన్నట్లుగా రాష్ట్రంలో ఒకేసారి వాతవరణం మారిపోయింది. కొండా సురేఖ మొదటి నుంచి ఇంతే అన్నట్లుగా చిత్రీకరించడంతో ఆమెకు సానుభూతి రాలేదన్నట్లుగా కనిపిస్తుంది. ఆనాడు జగన్‌ను నమ్ముకుని రాజీనామా చేసినా పెద్దగా ప్రయోజనం పొందలేదు. ఆస్తుల విషయంలో ఇద్దరికి చెడిందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పెద్దఎత్తున వైఎస్ బినామీగా ఉన్నారని టాక్. అందుకు జగన్ రూ.200 కోట్ల ఆస్తిని తీసేసుకోవడంతో అక్కడ లింకులు పోయాయని తెలిసింది.ఎంతో ఉండాల్సిన ఆప్యాయత కనిపించలేదు. ఇక కేసీఆర్ చేరదీసినా అక్కడ ఇంటి పోరుతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దయాకర్ రావు రాగానే పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయారు.