స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
పని ఏదైనా.. మేఘా లూటీ ఆగలేదు?
మేఘా.. బాలానగర్లో 20 ఏండ్ల క్రితం చిన్న ఏరియాలో పేరు మాత్రమే గొప్పగా పెట్టుకున్న కంపెనీ. చిన్నప్పుడు నెల్లూరు నీళ్లు తాగిన అలవాటుతో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వదిలివేసిన మెటీరియల్ను తక్కువకు తెచ్చుకొని వెల్డింగ్ చేసుకుంటూ కమీషన్లతో భారీగా బతికేశారు. అందుకు సాక్ష్యాలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పటికీ చెబుతుంటారు. ప్రభుత్వ కాంట్రాక్టుల పని ఎలా చేజిక్కించుకోవాలి, ఆ తర్వాత ఏమైనా చేయ్యొచ్చు అనే భావనలో ఉంటారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు వారు అనుకున్న దాని కంటే ఒక్క శాతం ఎక్కువ డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారనే భావనతో పని చేశారు.
