తెలంగాణ
Harishrao Letter to CM: ‘సీఎంవా.. లేక రియలెస్టేట్ ఏజెంటువా?’ రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సంచలన లేఖ!
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా.. లేక రియలెస్టేట్ ఏజెంటువా?’ అని ప్రశ్నిస్తూ ఆయన సీఎంకు ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ అమ్మకానికి పెట్టడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. నాడు భూములను జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి అడ్డగోలుగా వేలానికి పెడుతున్నారని మండిపడ్డారు. రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 10.63ఎకరాల విలువైన హెరిటేజ్ భూమిని ఈ నెల ఆగస్టు 17, 21తేదీల్లో వేలం వేయడానికి టీజీఐఐసీ(TGIIC) సిద్ధం కావడాన్ని హరీశ్ రావు ఆక్షేపించారు.
