తెలంగాణ

Harish Rao:22ఏ ముసుగులో మీ కబ్జా భూములు రెగులరైజ్ చేస్తే ఖబర్దార్

“22A ముసుగులో ఆక్రమించిన లేదా వివాదాస్పద భూములను తొలగిస్తే మాత్రం బీఆర్‌ఎస్ ఊరుకోదు” అని రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు హరీశ్ రావు. “అధికారుల్లారా.. తప్పులు మంత్రులు చేస్తారు.. నెపం మాత్రం మీ మీదకు నెడతారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జాబితాలు మార్చడం సాధ్యమా? మీరు చెప్పినట్లు తప్పులు చేస్తే చివరకు మీరు ఇరుక్కుంటారు. మీరు బాధపడాల్సి వస్తుంది. ముక్కుసూటిగా పనిచేయండి. తప్పు చేయకండి.. బలికాకండి” అని అధికారులకు సూచించారు.