రాజకీయాలు
మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు సంచలన లేఖ
రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం లేఖ రాశారు.రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్‌చేయాలని అందులో పేర్కొన్నారు.రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు కాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి, సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు. దాని కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
