కేటీఆర్ సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చాడు : సీఎం రేవంత్
TG: "సింగరేణి గనుల్లోని బొగ్గు మనది.. గోదావరి నుంచి తీసుకుంటున్న నీళ్లు మనవి.. కర్మాగారానికి ఇచ్చిన నేల మనది.. మరి ఇక్కడ తయారయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు ఎందుకు అప్పనంగా రాసిస్తున్నారు?" అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆస్తులను, సహజ వనరులను పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రికి ఘాటు లేఖ సంధించారుమంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణలో భాగంగా కుదుర్చుకున్న డీల్ వెనుక భారీ లొసుగులు దాగి ఉన్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. రాజస్థాన్ విద్యుత్ సంస్థతో సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే చౌక విద్యుత్‌లో ఏకంగా 800 మెగావాట్లను ఆ రాష్ట్రానికే దారాదత్తం చేయాలని నిర్ణయించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల రక్తం, చెమటతో నిర్మితమైన సింగరేణి సంపదను పక్క రాష్ట్రానికి కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు.
