తెలంగాణ
TG: బొగ్గు మనది.. కరెంట్ రాజస్థాన్‌కా? రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్!
TG: "సింగరేణి గనుల్లోని బొగ్గు మనది.. గోదావరి నుంచి తీసుకుంటున్న నీళ్లు మనవి.. కర్మాగారానికి ఇచ్చిన నేల మనది.. మరి ఇక్కడ తయారయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు ఎందుకు అప్పనంగా రాసిస్తున్నారు?" అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆస్తులను, సహజ వనరులను పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రికి ఘాటు లేఖ సంధించారు.
