తెలంగాణ
డ్యూటీకి రాకుండానే సంతకాలు.. హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలో బయటపడ్డ డాక్టర్ల బాగోతం
మాజీమంత్రి హరీశ్ రావు సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. డాక్టర్ల బాగోతం బయటపడింది. డ్యూటీ రిజిస్ట్రర్ లో సంతకాలు చేసిన డాక్టర్లు.. డ్యూటీలో మాత్రం లేరు. దీంతో వైద్యుల విధుల నిర్వహణపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ రిజిస్టర్ లో సంతకాలు ఉన్నప్పటికీ పలువురు ఎమర్జెన్సీ విభాగాల డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. 318 మంది డాక్టర్లు ఉన్న చోట 301 మందే ఇన్-పేషెంట్లా? అని విస్తుపోయారు. మధ్యాహ్నం 2:30 గంటలకే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, మెడిసిన్, రేడియాలజీ, కంటి విభాగాల్లో ఒక్క డాక్టరూ లేకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
