హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు
జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తుండటం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ‘శక్తి’స్కీంను వ్యతిరేకిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు..కొత్తగా తెచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. దానికి మద్దతు తెలిపేందుకు హరీశ్‌రావు వరంగల్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి పర్యటనకు అనుమతి లేదంటూ గృహనిర్బంధంలో ఉంచారు. ఎవరూ బయటకు వెళ్లకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించినట్టు సమాచారం.
