తెలంగాణ

వెంటనే కరువు మండలాలను ప్రకటించండి, రైతులకు సాయం చేయండి

Harish Rao: రాష్ట్రంలో వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని మాజీమంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు సాయం చేయాలన్నారు. ఇక చివరి దశలో ఉన్న పంటలకు సాగునీటిని, నాణ్యమైన కరెంటును అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరుఫున డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మాట్లాడి కోల్ ఇండియా నుంచి బొగ్గు తెచ్చుకుని ఉంటే పంటలు ఎండిపోవు కదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రకృతి వల్ల జరిగిన నష్టం తక్కువ.. కాంగ్రెస్ వైఫల్యం వల్ల జరిగిన నష్టం ఎక్కువ అని విమర్శించారు. ఏమన్నా అంటే అధికారులను సస్పెండ్ చేస్తా అని సీఎం రేవంత్ అంటున్నారు.. అది కరెక్ట్ కాదు. అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన రైతుల కష్టాలు తీరవు కదా? అని హరీశ్ రావు అన్నారు.