తెలంగాణ

కోకాపేట్ నివాసంలో హరీశ్‌రావు ముందస్తు హౌస్ అరెస్ట్!

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్(TIMS) ఆసుపత్రిని పరిశీలనకు సిద్ధమైన మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు కోకాపేట్‌లోని ఆయన నివాసంలో ముందస్తు జాగ్రత్త చర్యగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆస్పత్రి వద్ద అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు యంత్రాంగం వెల్లడించింది. హరీశ్ రావు పర్యటన పిలుపు నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే కోకాపేట్‌లోని ఆయన నివాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.