తెలంగాణ
Harish Rao: కొత్త బీమా పథకంతో 13లక్షల మంది రైతులకు అన్యాయం- హరీశ్ రావు
నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల 15 వేల మందికి ఈ పథకం ఒక భరోసా ఇచ్చిందని తెలిపారు. కానీ, ఆగస్టు 13 నుంచి ఈ రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన మంచి పథకాలను ఒక్కొక్కటిగా తీసేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం కొత్తగా తెచ్చే బీమా పథకం వల్ల ఏకంగా 13 లక్షల మంది రైతులు బీమాకు దూరం అవుతున్నారని ఆరోపించారు.
