తెలంగాణ

సీఎం అపాయింట్మెంట్ ఇస్తే ఆయనకే చెబుతా : మహిళా వ్యాపారవేత్త

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు తనను వేధించినట్టు ఓ మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా నిన్న ఆమె సంచలన పోస్టుపెట్టింది. ‘సాయం కోరితే సీఎం సన్నిహితుడు గెస్ట్ హౌస్‌కు రమ్మని పిలిచాడు. అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వమని అడిగితే, సీఎంకు సన్నిహితుడైన ఒక వ్యక్తి గెస్ట్ హౌస్‌కు రావాలని పిలిచాడు’ అంటూ కె.శోభా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై సదరు బాధిత మహిళా వ్యాపారవేత్త స్పందించారు. ఈసారి ఏకంగా వీడియో సందేశం విడుదల చేశారు.తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వీడియో సందేశంలో మిధున అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని శోభారెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి తనకు ఒక్క అపాయిట్మెంట్ ఇస్తే మున్సిపల్ శాఖలో శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలు కూడా బయటపెడతానని పేర్కొన్నారు.