క్రైమ్

దసరా మామూళ్ల వేధింపులు.. డిప్యూటీ తహసీల్దార్ బలవన్మరణం!

 దసరా పండుగ వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. కొవ్వూరు డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ (Deputy Tahsildar Laxminarayana) భద్రాచలంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పండుగ మామూళ్ల పేరుతో పలువురు విలేకరులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ తీవ్రంగా వేధించడం వల్లే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్ లభించడంతో రెవెన్యూ వర్గాల్లో, స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.