తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు వేధింపులు.. పీఈటీ ఎస్కేప్!

విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మంచి భవిష్యత్ ప్రసాదించాల్సిన గురువులు గాడి తప్పుతున్నారు. విద్యార్థినులు కూడా తమ పిల్లలే అనుకోవాల్సిన వారు తమలోని క్రూరత్వాన్ని, వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నట్టు సమాచారం. కొందరు ధైర్యం చేసి ఇంట్లో ఈ విషయాన్ని చెప్పగా.. స్కూల్స్‌లో విద్యార్థినుల పట్ల జరుగుతున్న దారుణాలు నెమ్మదిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా గుదిమళ్ల ప్రభుత్వ పాఠశాలలో ఓ పీఈటీ టీచర్ విద్యార్థినులను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఫిజికల్ ట్రైనింగ్ పేరుతో బాలికలను అసభ్యంగా తాకుతూ ఇబ్బందులకు గురిచేసినట్టు సమాచారం. అయితే, వేధింపులు తీవ్రతరం కావడంతో పీఈటీ షఫీ అహ్మద్‌పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వెలుగుచూసింది. ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.