Crime : ఒకరి వేధింపులు, మరొకరు మోసం.. ఇద్దరు యువతుల ఆత్మహత్య
రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకరేమో పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేయగా.. మరొకరు కులాన్ని సాకుగా చూపి పెళ్లి నిరాకరించడంతో మరో యువతి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. యువతుల మరణాలకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకివెళితే.. నారాయణపేట జిల్లా జౌల్లాపురం గ్రామంలో నివాసముంటున్న హన్మంతు–వెంకటమ్మ దంపతులకు కూతురు అనిత (23) ఉంది. హైదరాబాద్లో డిగ్రీ చదువుతోంది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో అనితకు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా సన్నిహితంగా ఇద్దరు సన్నిహితంగా ఉండేవారని సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలని అనిల్ పదే పదే వేధించేవాడు. దీంతో అతన్ని దూరం పెట్టి అనిత చదువుకుంటోంది. దూరం పెట్టినప్పటికీ అనిల్ వేధింపులు ఆగకపోవడంతో, తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని అనిత ఆత్మహత్య చేసుకుంది.
