క్రైమ్

బీజేపీ కార్పొరేటర్ వేధింపులు..దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం

రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్పొరేటర్ వేధింపులు భరించలేక దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పొలిటికల్ కారణాలకు తనను బాధ్యుడిని చేస్తూ వేధింపులకు గురిచేశాడని,అందుకే చనిపోతున్నట్టు ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు బాధితుడు సెల్ఫీ వీడియోలో మాట్లాడారు.అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకివెళితే.. కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగుడు కళ్లేపల్లి శివ కిసాన్‌నగర్‌లో ఉంటున్నాడు. గత కొంతకాలంగా బీజేపీ కార్పొరేటర్ తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ దివ్యాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.దోమలను చంపేందుకు వినియోగించే ‘ఆల్‌అవుట్’ మందు తాగి శివ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్టు సమాచారం.