క్రైమ్

హైదరాబాద్‌లో ‘గన్’ కలకలం.. పారిపోయిన బార్ కస్టమర్లు

హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి మరోసారి గన్ కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుల్లుగా తాగేసి బిల్లు చెల్లించే విషయంలో తోటి మిత్రులతో గొడవకు దిగినట్టు సమాచారం. తాను బిల్లు కట్టనని, మీరే కట్టాలని గొడవకు దిగడంతో బౌన్సర్లు వచ్చి వారిని కిందకు పంపించివేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన కారులోని గన్ తీసుకొని వచ్చి కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదంటే కాల్చేస్తానని ఫ్రెండ్స్, బౌన్సర్లను బెదిరించినట్టు సమాచారం. సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. బౌన్సర్లు ఎంట్రీ ఇచ్చి వారిని కిందకు పంపడంతో తన కారులోని గన్ తీసుకొచ్చి బెదిరించగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే అక్కడకు వచ్చి గన్ చూపించిన వ్యక్తిని అరెస్టు చేశారు.