International
Guinea: చెత్త కారణంగా 30 మంది మృతి.. డంపింగ్ యార్డు ప్రాంతాల్లో మోగుతున్న డేంజర్ బెల్స్!..
పశ్చిమ ఆఫ్రికాలోని గినియా రాజధాని కోనక్రీలో ఘోర ప్రమాదం సంభవించింది. నగరంలోని దార్ ఎస్ సలామ్ లో ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డ్ లో కొండలా పేరుకుపోయిన చెత్త ఒక్కసారిగా కూలిపోయి.. సమీపంలోని పూరి గుడిసెలపై పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
