National

GST Clarification: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై 5% జీఎస్టీ బాదుడు? కేంద్రం బిగ్ క్లారిటీ ఇదే!

GST Clarification: జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా 5 శాతం జీఎస్టీ భారం మోపిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. నిత్యం ఆన్‌లైన్‌లో ఫుడ్ మొదలైన ఆర్డర్ చేసే సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు పడనుందంటూ జరుగుతున్న ప్రచారంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసింది.ఈ వివాదంలో అసలు సంచలన విషయం ఏమిటంటే.. ప్రభుత్వం పన్ను పెంచకపోగా, ఏకంగా 13 శాతం తగ్గించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇ-కామర్స్ డెలివరీ సర్వీస్‌లపై కొత్తగా ఎలాంటి పన్నులు విధించలేదు.