National
భారత్ చేతిలో సూపర్ ఐ.. GSLV-F17 ప్రయోగం సక్సెస్!..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖాతాలో మరొక సంచలనాత్మక విజయం నమోదైంది.. అంతరిక్షంలో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయోగం ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన అత్యాధునిక 'ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్' (EOS-09)ను మన శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది ఇస్రోకు 17వ విజయవంతమైన మైలురాయి కావడం విశేషం.
