ఒక్కటిగా పెరిగి, చిన్నతనం నుంచి కలిసి చదువుకుని..చివరకు!
ఇద్దరు ఫ్రెండ్స్ జీవితంలో ఎదురైన ఇబ్బందులు, ఒత్తిడితో కూడిన జీవితాన్ని ఇకముందు లీడ్ చేయలేమని భావించి ఆత్మహత్యకు యత్నించారు. ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. యూపీ రాష్ట్రం భదోహికి చెందిన కవిత, సాధన ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి కలిసే చదువుకున్నారు. 10వ తరగతి వరకు కలిసి పెరిగిన వీరిద్దరూ ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకుంటూ ఉండేవారు. సాధనకు రెండు నెలల కిందట తనకు ఇష్టంలేని వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. భర్త తీరు నచ్చకపోవడంతో నెలరోజులుగా సాధన ఇంట్లోనే ఉంటోంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైంది.మరోవైపు కవిత ఓ వ్యక్తిని ప్రేమించగా కుటుంబ సభ్యులు అతడిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించారు. దీంతో కవిత సైతం తీవ్ర ఒత్తిడికి లోనైంది. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని విషపు గులికలు మింగారు. ఈ ఘటనలో కవిత మరణిచంగా..సాధన ప్రాణాాపాయ స్థితిలో ఉంది.
