తెలంగాణ

తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు : సీఎం రేవంత్

రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ శ్రేణులు ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు.సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన సందర్భంగా నేడు ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరై త్రివర్ణ పతాకాన్నిఆవిష్కరించారు.దానికి ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నమస్కరించి అమరుల త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. పబ్లిక్ గార్డెన్స్‌‌లో పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, అణచివేతపై పోరాడిన అమరుల త్యాగాలను స్మరిస్తూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.