ఏపీ

ప్రేమపెళ్లికి గ్రీన్‌సిగ్నల్.. కాలువలో దూకి ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

సాధారణంగా ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరంచలేదని ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడం కామన్. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కానీ, ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించినా లవర్స్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో అమ్మాయి మృతి చెందగా.. అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఏపీలోని పశ్చిమగోదావరి పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన సందీప్ కుమార్ (22) భీమవరంకు చెందిన లలితాంబికలుగా(20)లు ప్రేమించుకున్నారు. వివాహాం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని సందీప్ వారి ఇంట్లో చెప్పగా.. పెద్దలు అంగీకరించారు. అమ్మాయికి పేరెంట్స్ లేకపోవడంతో తన పెద్దమ్మ వద్దే పెరుగుతోంది. ఆమె సైతం వీరి పెళ్లికి అంగీకరించింది.