క్రైమ్
ఐఫోన్ కోసం మనవరాలి ఘాతుకం..తాతను హత్య చేయించి..!
డబ్బుల మాయలో పడి కొందరు మానవతా విలువలు మర్చిపోతున్నారు. బంధువులు, కుటుంబసభ్యులు అని చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు.డబ్బులు వచ్చాయా?లేదా?అని మాత్రమే ఆలోచన చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు, పెద్దలు అని ఏమాత్రం ఆలోచించకుండా ఘాతుకాలకు పాల్పడుతున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆస్తి కోసం రక్తం పంచుకుని పుట్టిన వారిని,కన్నవారిని సైతం నేటితరంలోని కొందరు వదలడం లేదు. ఏమాత్రం కనికరించకుండా కడతేరుస్తున్నారు. తాజాగా ఐఫోన్ కోసం తాతను హతమార్చిన ఘటన ఒకటి వెలుగచూసింది. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా సంచలనానికి తెరతీసింది. వివరాల్లోకివెళితే.. ఐఫోన్ కోసం ప్రియుడితో కలిసి ఓ 13 ఏళ్ల బాలిక తాతను చంపించింది.ఈ ఘటన కేరళం - అలప్పుజలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.
