క్రైమ్

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగం.. 14 మంది అరెస్ట్!

రాష్ట్రంలో ఘరానా మోసం వెలుగుచూసింది. పదవీ విరమణ పొందిన తర్వాత మరణించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుక్కి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించేందుకు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు.నల్గొండ జిల్లాలో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది. దీంతో స్థానికులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు.కారుణ్య ఉద్యోగానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలిస్తుండగా అవి నకిలీగా తేల్చిన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ మోసం బట్టబయలైంది.వివరాల్లోకివెళితే.. నల్గొండలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి, సర్వీసులో ఉండగానే రిటైర్డ్ ఉద్యోగి చనిపోయినట్లు రికార్డులు తారుమారు చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన ఉద్యోగి కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు యత్నించారు.