International

Google: అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు.. గూగుల్‌ సంచలన ప్రయోగం!!..

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాను చేపట్టిన ప్రాజెక్ట్‌ సన్‌ క్యాచర్‌ కింద అత్యధిక ఇంధన సమర్థత, పనితనం కలిగిన కృత్రిమ మేధ (ఏఐ) యాక్సిలరేటర్‌ చిప్‌ అయిన ట్రిల్లియం టెన్సర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (టీపీయూ)ను త్వరలో పరీక్షించనుంది. రేడియేధార్మికత, వేడి, కనెక్టివిటీ వంటి సవాళ్లను అధిగమించి సౌర విద్యుత్‌ ఆధారిత కృత్రిమ మేధ కంప్యూటింగ్‌ సదుపాయాలు అంతరిక్షంలో మనుగడ సాగించగలవా అన్నది పరీక్షిస్తున్నారు. ఈ ఏర్పాటు ద్వారా ఏఐని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గూగుల్‌ సన్నాహాలు చేస్తోంది. ఖగోళంలో కృత్రిమ మేధ డేటా సెంటర్లను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్‌ ఆధారంగా నడిచే ఉపగ్రహాల సాయంతో భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.