తెలంగాణ
తెలంగాణ సర్కార్ తీపి కబురు.. కేవలం రూ.3.50లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ ప్రాంత అల్పాదాయ వర్గాల (LIG) సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) వెలుపల ఉన్న ఐదు ప్రధాన నగరపాలక సంస్థల పరిధిలో 'ఇందిరమ్మ ఇళ్ల టవర్స్' పథకం కింద మొదటి విడతలో 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక డిమాండ్ సర్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బృహత్తర పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల భారీ సబ్సిడీని అందించడంతో పాటు స్థలాన్ని ఉచితంగా సమకూరుస్తోంది. దీంతో లబ్ధిదారుడి వాటాగా కేవలం రూ.3.50లక్షలు మాత్రమే చెల్లిస్తే సొంత ఫ్లాట్ సొంతమయ్యే సువర్ణావకాశం లభించింది.
