పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ శుభవార్త
తెలంగాణ పోలీసు అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ శుభవార్త చెప్పినట్టు తెలుస్తోంది. గతకొన్నేళ్లుగా పెండింగులో ఉన్న పోస్టులు, ప్రమోషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పోలీసు శాఖను ఆదేశించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధికారుల పదోన్నతుల ప్రాసెస్ మీద డీజీపీ ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. దీనిలో భాగంగానే పోలీస్ శాఖలో వివిధ స్థాయిల్లో అధికారుల పదోన్నతులకు సంబంధించి కీలక అంశాలపై ఇవాళ తన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో అర్హులైన పోలీసు అధికారుల సర్వీస్ రికార్డులు, అర్హతలు, ఖాళీల వివరాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతుల దస్త్రాలు, కోర్టు కేసుల క్లియరెన్స్ పదవులు, త్వరలో పదవీ విరమణ చేయనున్న అధికారుల స్థానంలో కొత్త వారిని భర్తీ చేయాల్సిన ఖాళీలపై ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టారు.
