వ్యాపారం
విద్యార్థులకు ‘ఎయిర్ ఇండియా’ గుడ్ న్యూస్.. టిక్కెట్ల బుకింగ్‌కు బంపర్ ఆఫర్!
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులకు శుభవార్త అందించింది. కాలేజీ సెమిస్టర్లు, ఇంటర్న్‌షిప్‌లు, రాబోయే పండుగల సీజన్లో స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో 'స్టూడెంట్ ఫేర్' పేరుతో ప్రత్యేక రాయితీ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకునే విద్యార్థులకు విమాన ప్రాథమిక ఛార్జీ (బేస్ ఫేర్) పై 10 శాతం తక్షణ తగ్గింపు లభించనుంది. డిస్కౌంట్‌తో పాటు విద్యార్థులకు లగేజీ విషయంలోనూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భారీ ఉపశమనం కల్పించింది.
