తెలంగాణ

పల్లెవాసులకు శుభవార్త.. బస్సుల నైట్‌హాల్ట్‌కు రైట్ రైట్

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మెరుగైన రవాణా సేవలు కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు పల్లెల్లో రాత్రి ఆర్టీసీ బస్సులు బస చేసేవి. ఉదయాన్నే మరల గమ్యస్థానానికి చేరేవి. ప్రయాణికులకు సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చివి. దశాబ్దకాలం పాటు ఈ సేవలు నిలిచిపోగా.. మరోసారి ఆ సేవలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లోని మారుమూల పల్లెల్లో ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. డిపోల నుంచి బయలు దేరిన బస్సులు తమకు కేటాయించిన పల్లెల్లోని ప్రధాన చౌరస్తా లేదా పాయింట్ వద్ద రాత్రి బస చేయాల్సి ఉంటుంది. ఉదయాన్నే ప్రయాణికులతో మరల సంబంధింత జిల్లా, పట్టణ బస్ స్టేషన్లకు చేరుకోవాల్సి ఉంటుంది. పల్లెల నుంచి ఉద్యోగాలు, చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ఈ సర్వీసులు ఎంతోగానో ఉపయోగపడతాయి.