తెలంగాణ
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. రెండు రోజులు భారీ వర్షాలు!
ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య వాతావరణ శాఖ చల్లని కబురుచెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల పాటు (ఆదివారం, సోమవారం) వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD), రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక అప్డేట్ ఇచ్చాయి. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం చురుకుగా కొనసాగుతుండటంతో పాటు, దక్షిణ కోస్తాంధ్ర నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
