ఏపీ
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యం తీసుకోకపోతే నేరుగా ఖాతాల్లోకే నగదు!
ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ డిపోల వద్ద బియ్యం తీసుకోని లబ్ధిదారులకు, వారి ఉచిత బియ్యం కోటా స్థానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ చేసే వినూత్న విధానానికి శ్రీకారం చుడుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, డీలర్ల వద్ద జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇప్పటికే గుజరాత్‌లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(CBDC) విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తుండగా, ఇటీవల ఏపీ పౌరసరఫరాల శాఖ అధికారుల బృందం అక్కడ పర్యటించి అధ్యయనం చేసింది.
