తెలంగాణ
‘ఇందిరమ్మ’ లబ్దిదారులకు శుభవార్త.. మరో రూ.72 వేల ఆర్థిక సాయం!
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే.అయితే, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్రానికి మంజూరైన ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను అనుసంధానించాలని నిర్ణయించింది.ఈ క్రమంలోనే మొదటి విడత కింద ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన 1.75 లక్షల ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అధికారులు పీఎం ఆవాస్ యోజన (PMAY) అధికారిక పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఆ తర్వాత రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మట్టి గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో జీవిస్తున్న మరో 25 వేల మంది లబ్ధిదారులను కూడా ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకురానున్నారు.
