రైతులకు శుభవార్త.. ఆ పంటలకు కనీస మద్దతు ధర పెంపు !
దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రబీ సీజన్లో తప్పనిసిరి చేసిన ఆరు పంటలకు కనీసమద్దతు ధర (MSP)ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంత్రం ప్రధాని మోడీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ఆయిల్ గింజలు, పప్పు దినుసులకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు గోధుమలు క్వింటాకు ధర రూ.25 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కుసుమ పువ్వు ధర క్వింటాకు రూ.675 పెరగ్గా.. ఆవాల ధర క్వింటాకు రూ.413, పప్పుదినుసులు (కందిపప్పు) ధర క్వింటాకు రూ.390 పెంచినట్లు తెలిపారు. బార్లీ కనీస ధర క్వింటాకు రూ.136, శనగలు రూ.83 పెరగ్గా.. గోధుమల కనీస ధర క్వింటాకు రూ.25 మాత్రమే పెంచినట్టు వెల్లడించారు.
