ఏపీ

శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ

తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకునే భక్తులకు శుభవార్త.. ఇన్నిరోజులు భక్తుల రద్దీతో కిటకిటలాడిన స్వామి వారి సన్నిధానంలో ప్రస్తుతం ఫ్రీగా దర్శనాలు జరుగుతున్నట్టు టీటీడీ పేర్కొంది.శ్రావణమాసంలో సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టగా.. ప్రస్తుతం 4 గంటలు మాత్రమే పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. మెట్ల మార్గంలో కూడా భక్తుల రద్దీ తగ్గిందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వేడుకలు జరుగుతుండగా ప్రజలు తిరుమల ప్రయాణాలు పోస్టు పోన్ చేసుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అందుకే రద్దీ తగ్గిందని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారని తెలిపారు. ఎలాంటి దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కేవలం 4 గంటల వ్యవధిలోనే పూర్తవుతుందని టీటీడీ తెలిపింది.