National
Gold Price: భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. అసలు కారణాలు ఇవే!
Gold Price: కొన్ని రోజులుగా చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివస్తున్నాయి. మార్కెట్లో రేట్లు భారీగా పడిపోతుండటంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే, ఇన్వెస్టర్లు మాత్రం షాక్ తింటున్నారు. అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు, అమెరికా నుంచి వస్తున్న తాజా ఆర్థిక లెక్కల దెబ్బకు పసిడి రేట్లు దాదాపు నాలుగు నెలల కనిష్టానికి జారిపోయాయి. అటు వెండి కూడా ఔన్స్‌కు 50 డాలర్ల కంటే కిందికి పడిపోయింది.ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో మన దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లోనూ రేట్లు దిగజారాయి. బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,263కి పడిపోగా, వెండి కేజీ ధర రూ.1,84,245 దాకా తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 3,956 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్కెట్లో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోవడమే ఈ భారీ తగ్గుదలకు దారితీసిందని చెబుతున్నారు.
