వ్యాపారం

GOlD : హమ్మయ్యా.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు!

పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట లభించింది. కొద్ది రోజులుగా ధరలు పెరుగుతూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ఎట్టకేలకు దిగొచ్చింది. నిన్నటితో పోలిస్తే సోమవారం ఉదయం పసిడి, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదు అయ్యింది.ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇవాళ హైదరాబాద్‌లో మేలిమి బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.1,51,970 పలుకుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గగా ప్రస్తుతం రూ. 1,39,300గా ఉంది. ఇది అంతకుముందు రోజు నమోదైన రూ.1,39,650 కంటే రూ. 10 తక్కువ. ఇక వెండి సైతం పసిడి బాటలోనే నడుస్తోంది.