National
Gold Rate India: గ్లోబల్ మార్కెట్లో పసిడి పతనం.. భారత్లో మాత్రం తగ్గని ధర!
Gold Rate India: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పరుగుకు ఊహించని బ్రేకులు పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు భారీగా కుప్పకూలుతున్నా.. భారత్లో మాత్రం బంగారం తన ‘రాయల్ లుక్’ను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. గ్లోబల్ మార్కెట్లో బంగారం విలువ ఏకంగా 24 శాతం మేర పతనమైనప్పటికీ, మన దేశంలో ఆ స్థాయిలో తగ్గుదల నమోదు కాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రపంచ మార్కెట్లలో ధరలు నేలచూపులు చూస్తున్నా, భారతీయ కొనుగోలుదారుడికి మాత్రం పసిడి చౌకగా మారకపోవడం వెనుక పెద్ద ఆర్థిక సమీకరణాలే దాగున్నాయని అంటున్నారు. అవి ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
