వ్యాపారం

భారీగా పతనమైన బంగారం ధర

గతనెల రోజులుగా బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూనే పోతున్నాయి. ఫలితంగా బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు జంకుతున్నారు.ఆషాఢం సేల్ పూర్తవడంతో ఆఫర్లు కూడా పెద్దగా లేవు. మరోవైపు శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది. దీంతో బంగారం ధరలు తగ్గుతాయని భావించిన వారికి వరుసగా షాకులు తగిలాయి. ఈ క్రమంలోనే తాజాగా పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. రాఖీ పండుగ వేళ బంగారం ధరలు దొగొచ్చాయి. తాజాగా తగ్గిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.3,160 తగ్గగా రూ.1,59,820 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ గోల్డ్ విషయానికొస్తే 10 గ్రాములపై రూ.2,900 మేర తగ్గి రూ.1,46,500 కు చేరుకుంది.