వ్యాపారం

వారంలో భారీగా తగ్గిన పసిడి.. హైదరాబాద్‌లో ఇవే తాజా రేట్లు!

 గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లోనే 10 గ్రాముల తులానికి ఏకంగా రూ.3,160 మేర తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాల కారణంగానే దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు వరుసగా క్షీణిస్తున్నాయని బులియన్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే బలమైన అంచనాలతో పాటు యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు (యీల్డ్స్) గణనీయంగా పెరిగాయి.