Gold Price Prediction: 2027లో బంగారం ధర ఎంత ఉండొచ్చు?
Gold Price Prediction: ధంతేరస్ వేళ పసిడి ధరలు భారీగా దిగిరావడంతో ఊపిరి పీల్చుకున్న కొనుగోలుదారుల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం రూ.1.45 లక్షల శ్రేణిలో ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. వచ్చే 2027 నాటికి ఏ స్థాయికి చేరుతుంది? ఇప్పుడు తగ్గిన ధరల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో లాభాలు ఉంటాయా లేక మరింత పడిపోతుందా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'యాక్సిస్ డైరెక్ట్'తో పాటు అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వెల్లడించిన అంచనాలు ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.సమీప కాలంలో వడ్డీ రేట్ల ఒత్తిడి వల్ల బంగారం ధరల్లో కాస్త ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా చూస్తే పసిడి మళ్లీ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ధంతేరస్ నాటికి (2027 ముంగిట) దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.65 లక్షల నుంచి ఏకంగా రూ.1.80 లక్షల వరకు చేరే అవకాశముందని యాక్సిస్ డైరెక్ట్ నివేదిక వెల్లడించింది. అంటే ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేసిన వారికి ఏడాదిన్నర కాలంలో 20 నుంచి 25 శాతం వరకు బంపర్ రాబడి (రిటర్న్స్) దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
