వ్యాపారం
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. తులంపై రూ. 4,000కు పైగా తగ్గుదల!
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా దిగివస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిల్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్యులకు, ముఖ్యంగా పండగ వేళ కొనుగోలుదారులకు గొప్ప ఊరటనిస్తోంది. బలమైన అమెరికన్ డాలర్ సూచీతో పాటు వచ్చే ఏడాది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న వార్తలతో గ్లోబల్ మార్కెట్‌లో బులియన్ వ్యాపారంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. గత నాలుగైదు రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ.4వేలకు పైగా తగ్గగా, వారం రోజుల్లో మొత్తంగా రూ.6వేల నుంచి రూ. 7,000 వరకు పడిపోయింది. మంగళవారం ఒక్కరోజే తులంపై రూ.1,370 మేర తగ్గుదల నమోదైంది.
