GolD : 24 క్యారెట్ల గోల్డ్, వజ్రాలతో మెరిసిన ‘బొజ్జ గణపయ్య’
వినాయక చవితి వచ్చిందంటే చాలు..రంగురంగుల తీరొక్క గణపయ్యలు గల్లీగల్లీలో దర్శనమిస్తుంటాయి.పండుగకు రెండు, మూడు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ ప్రారంభం అవుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లలో విగ్రహాల తయారీని ప్రారంభిస్తారు. విగ్రహా తయారీలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కాగా, ప్రస్తుతం నగరంలో24 క్యారెట్ల బంగారం, వజ్రాలతో తయారైన విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. నగరంలోని బేగంబజార్ ఫీల్ ఖానాలోని ఓ జ్యువెలరీ షాపులో పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం, 3.83 లక్షల అమెరికన్ వజ్రాలతో 48 కేజీల భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేయించారు. 8 మంది కళాకారులు 8 నెలల పాటు శ్రమించి దీన్ని రూపొందించారు. 11 రోజుల పూజల అనంతరం ఈ విగ్రహాన్ని యథావిధిగా ఉంచి, కేవలం మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు ఆధార్, నిఖితేశ్ తెలిపారు.
