GO 240 Protests: బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకోం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
GO 240 Protests: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన 'జీఓ నంబర్ 240' ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో అగ్గి రాజేస్తోంది. వేల కోట్ల పరిహారం ఇస్తామన్నా సరే.. తమకు ఆ డబ్బే వద్దని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములే ముద్దంటూ రైతాంగం తెగేసి చెబుతోంది. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరిట చిన్నకారు రైతుల ఉసురు తీయవద్దంటూ ఉప్పల్ నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ క్రమంలో రైతులకు అండగా బాధితులతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించి ప్రభుత్వ విధానాలపై సమరశంఖం పూరించారు.మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని కలిసిన సందర్భంగా ఉప్పల్ రైతులు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని ముక్తకంఠంతో వినిపించారు. "మా రక్తాన్ని ధారబోసి కాపాడుకున్న భూములను ప్రాజెక్టుల పేరుతో ఎలా లాక్కుంటారు?
