International
ఇరాన్‌కు ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలు బంద్.. అమెరికా భారీ ఆర్థిక ఆంక్షలు!
అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై తన ఆర్థిక ఒత్తిడిని తీవ్ర స్థాయికి చేర్చింది. సెప్టెంబర్ 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థల సర్వీసులను నిలిపివేయనున్నట్లు యూఎస్ ట్రెజరీ ప్రకటించింది. ఇరాన్ విమానాలకు ఏ దేశంలోనైనా ఏ విమానాశ్రయం అయినా ఇంధనం నింపినా, ల్యాండింగ్ సేవలు అందించినా, లేదా టికెట్లు విక్రయించినా ఆయా సంస్థలను అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని 'సెకండరీ ఆంక్షల' రూపంలో కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
