తెలంగాణ

లెక్కలు చెప్పి రాజీనామా చేస్తా :ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభం అవ్వగా వాడివేడీగా నడుస్తున్నాయి. ప్రశ్నోత్తరాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతి ఇవ్వడంతో సభ్యులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎన్నికలు ముగిసి రెండున్నరేండ్లు అయినా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులు కేటాయిచడం లేదని, మంత్రులు పట్టించుకోవడం లేదని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిగి, సీఎం సొంత నియోజకవర్గం కొండగల్‌కు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కానీ, తన సొంత నియోజకవర్గం ఆర్మూర్‌కు నిధులు ఇవ్వడం లేదని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూరులో నిజాం కాలంలో కట్టిన ఎంఆర్వో ఆఫీస్ ఉందని, సబ్‌కలెక్టర్ ఆఫీస్‌లో మాత్రం క్లర్క్ కూర్చునే విధంగా సౌకర్యాలు ఉన్నాయని, ఇంటిగ్రేటెడ్ కార్యాలయం ఇవ్వాలని కోరారు.