క్రైమ్
పటాన్ చెరులో బాలిక కిడ్నాప్..పేరెంట్స్‌పై దాడి!
హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను గుర్తు తెలియని దుండుగులు ఎత్తుకెళ్లారు. పటాన్‌చెరు పరిధిలోని పోచారం శివారులో గల సాయి దర్శన్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకివెళితే.. సాయి దర్శన్ కాలనీలో 17 ఏళ్ల బాలిక స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నది. అక్కడే స్థానికంగా తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. అయితే, గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు నిన్న అర్ధరాత్రి బాలిక ఉంటున్న గుడిసెలోకి చొరబడినట్టు సమాచారం. అడ్డుకోబోయిన బాలిక తల్లిదండ్రులపై కర్రలు, బీర్ సీసాలతో దాడికి యత్నించినట్టు తెలిసింది.
