తెలంగాణ

రెవెన్యూశాఖలో పందికొక్కులు.. భూభారతి మాటున ఎకరాలకు ఎకరాలే మాయం?

22ఏ ను అడ్డంపెట్టుకుని రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి రూ. లక్షల నుంచి కోట్లల్లో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.తాజాగా ఉదాహరణ రెవెన్యూ అధికారుల భూ దాహాం, దోపిడీకి నిలువుటద్దంలా నిలుస్తోంది. వివరాల్లోకివెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని సర్వే నంబర్ 8లో నిషేధిత జాబితాలో ఉన్న 11.33 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఒక్కొక్కరి పేరిట 2.31 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిన రెవెన్యూ అధికారులు పాస్‌బుక్కులు కూడా జారీ చేసినట్టు సమాచారం. సర్వే నంబర్ 8/5లోని 2.31 ఎకరాలను ఒక్కో ఎకరా రూ.91 లక్షలకు కావాల్సిన వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే భూమిని తిరిగి నిషేధిత జాబితాలోకి మార్చి, భూమి విలువను రూ.35.29 కోట్లకు పెంచినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.