National

GenZ Protest: జెన్-జీ పోరాటాన్ని 'కుట్ర' అనడం న్యాయమా?

GenZ Protest: దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రోడ్డెక్కితే చాలు.. వారి వెనుక ఏదో అదృశ్య హస్తం ఉందని, విదేశీ శక్తుల ప్రోద్బలం దాగుందని ముద్ర వేయడం పాలకులకు పరిపాటిగా మారింది. దశాబ్దాలుగా చదువు, కొలువు, ఈఎంఐల చక్రబంధంలో బతికేస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్న 'జెన్-జీ' తరం ఒక్కసారిగా ప్రశ్నించేసరికి.. దానికి రాజకీయ కుట్రల రంగు పులమడం ఎంతవరకు కరెక్ట్ ? కళ్లెదుట భవిష్యత్తు నాశనమవుతుంటే రోడ్డెక్కిన నిస్సహాయ యువత ఆక్రందనను 'వ్యవస్థలపై దాడి'గా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.నీట్ పరీక్షల నిర్వహణలో డొల్లతనం బయటపడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడినప్పుడు వారు మొదట కోరింది ఒక్కటే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, వ్యవస్థాగత సంస్కరణలు. ఎవరి పదవులూ ఊడగొట్టాలని, ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఎవరూ రోడ్డెక్కలేదు.